The Chandrababu Naidu government is facing growing criticism for turning governance into a cycle of diversion politics, emotional manipulation, and continuous political conspiracies to avoid accountability on public issues. Critics say the administration’s core strategy over the last two years has been to ensure that public discourse never focuses on governance failures, corruption allegations, broken promises, rising debts, or people’s hardships. Instead, the state is being kept in a constant atmosphere of political tension, sensationalism, and targeted propaganda.
Former Chief Minister Y.S. Jagan Mohan Reddy has conducted 25 press conferences over the last two years from the YSRCP central office, speaking for nearly 46 hours and raising hundreds of questions on governance, corruption, Amaravati expenditure, welfare cuts, liquor mafia operations, farmers’ distress, pending employee dues, fee reimbursement arrears, and the weakening of Aarogyasri. Using documents released by the RBI, CAG, NITI Aayog, and the Central Government, he directly questioned the Chandrababu government on financial management, debt burden, public spending, and implementation failures. Yet, not a single issue has received a direct answer from the ruling party. Instead, the response has consistently been personal attacks, character assassination, political counter-allegations, social media censorship, and diversion tactics.
Governance Failures Hidden Behind Political Noise
The criticism against the government comes amid growing public distress across multiple sectors. Farmers continue to struggle without remunerative prices for crops such as maize, tobacco, and Bengal gram. Women are still waiting for the promised Rs. 1,500 monthly assistance. Unemployment allowance commitments remain unfulfilled. Fee reimbursement and Vidya Deevena dues running into thousands of crores remain pending, pushing students into severe hardship. Employees continue to face delays in DA arrears, PRC settlements, GPF payments, medical reimbursements, and surrender leave payments. Network hospitals under Aarogyasri are burdened with dues worth thousands of crores. Pension cuts, delayed welfare schemes, and increasing public debt have further intensified criticism against the administration.
Amaravati Expenditure and Debt Under Scrutiny
YSRCP leaders have also intensified attacks on the Amaravati model being pursued by the Chandrababu government. Questions are being raised over the practicality of spending nearly Rs. 2 lakh crore on capital-region infrastructure while the state continues to borrow heavily. Critics point to massive escalation in road, flyover, and infrastructure costs, repeated awarding of tenders to the same companies, and mounting debts linked to Amaravati projects. They argue that the government is prioritizing contractor-driven development and publicity projects over welfare delivery and balanced regional development.
“Babu Surety, Fraud Guarantee”
The ruling coalition is also being criticized for failing to implement the promises made under “Super Six” and “Super Seven.” Questions continue over missing welfare commitments including free bus travel for women, unemployment allowance, gas cylinder distribution, Annadata Sukhibhava payments, women’s financial support schemes, and housing assistance for the poor. Critics say that despite completing two years in office without any extraordinary crisis like COVID, the government is unable to showcase even a single transformative welfare or development achievement that directly improved people’s lives.
Publicity Over Performance
According to YSRCP leaders, the Chandrababu government has focused more on media management, image-building exercises, and political vendetta than governance. They argue that instead of answering direct questions backed by official data and documents, the administration is attempting to survive politically through fear narratives, diversion campaigns, and continuous targeting of the opposition. Observers note that the growing public discussion around the questions raised by Y.S. Jagan Mohan Reddy reflects increasing concern over governance priorities, financial transparency, and delivery failures under the current administration.
22.05.2026
కుట్రలే అజెండా.. సమాధానాల్లేవ్!
– నిరంతరం సమాజంలో అలజడి ఉండాలన్నదే బాబు ధ్యేయం
– తన వైఫల్యాలపై ఎవరూ మాట్లాడకూడదు, చర్చించకూడదు
– ఇవే లక్ష్యాలుగా సీఎం చంద్రబాబు దుర్మార్గపు రాజకీయం
– రెండేళ్లలో 25 ప్రెస్ మీట్లు పెట్టి నిలదీసిన వైయస్ జగన్
– వైయస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం వేదికగా వందలకొద్దీ ప్రశ్నలు
– అవినీతి, అక్రమాలు, అన్యాయాలను తూర్పారబడుతున్న జగన్
– చంద్రబాబు అవినీతికోటను బద్దలు కొడుతూ సూటి ప్రశ్నలు
– ఒక్క అంశానికి కూడా సమాధానం ఇవ్వకుండా ఎదురుదాడి
– ఆర్బీఐ, కాగ్, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వాటిని చూపినా గప్ చుప్
– వ్యక్తిత్వ హననం చేస్తూ చంద్రబాబు దుష్ట రాజకీయం
– మంత్రుల ప్రెస్ మీట్లలో వారి శాఖ గురించి, అభివృద్ధి ఊసే ఉండదు
– వైయస్ జగన్ సంధించిన ప్రశ్నలపై ప్రజల్లో విస్తృత చర్చ
– చంద్రబాబు దగుల్బాజీ రాజకీయాలపై వైయస్సార్ సీపీ ఆగ్రహం
**రెండేళ్ల పాలనలో ఘోర వైఫల్యాలు, అవినీతి, అన్యాయాలను ఎవరూ ప్రశ్నించకూడదు. సమాజంలో ఎప్పుడూ ఏదో ఒక అలజడి ఉండాలి. ఉద్రిక్త వాతావరణం ఉండాలి. గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ మీద ఎవరూ చర్చించకూడదు. ఆ భావోద్వేగ వాతావరణంలో ప్రజల్ని మభ్యపెట్టి దోచుకో, పంచుకో, తినుకో.. అన్నట్లు పాలన సాగించాలి….** ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి నుంచి ఎత్తుకున్న ఎత్తుగడ. ఆ క్రమంలో బరితెగించి దుర్మార్గాలకు తెగబడుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ 2024 జూన్ ఉంచి ఇప్పటి వరకు 25 సార్లు మీడియా సమావేశాలు నిర్వహించారు. 46 గంటల పాటు మాట్లాడారు. సగటున 1.50 గంటల పాటు ఒక్కో ప్రెస్ మీట్ జరిగింది. వందలాది అంశాలపై చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. అవినీతికోటను బద్దలు కొడుతూ ప్రశ్నలు సంధించారు. కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్, ఆర్బీఐ విడుదల చేసిన పత్రాలు చూపి నిగ్గదీసి అడిగారు. అయితే, ఏ ఒక్క ప్రశ్నకు కూడా టీడీపీ నుంచి సమాధానం ఉండదు. కేవలం వ్యక్తిత్వ హననమే అజెండాగా నీచ రాజకీయాలు చేస్తున్నారు.
రాష్ట్రంలో అన్ని వర్గాలకూ ఇక్కట్లు
రాష్ట్రంలో ప్రజలు బతుకు బండిని లాగడానికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతుకు ధర లేదు.. యువతకు ఉద్యోగం లేదు.. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదు.. ఉద్యోగులకు బకాయిలే మిగిలాయి.. విద్యార్థులకు ఫీజుల కోసం అష్టకష్టాలు పడే పరిస్థితి. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ప్రజల సమస్యలపై కాదు.. రాజకీయ కుట్రలపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గత రెండేళ్లలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా 25 సార్లు మీడియా సమావేశాలు నిర్వహించి, మొత్తం 46 గంటలపాటు ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రతి ప్రెస్‌మీట్‌లోనూ అవినీతి, అక్రమాలు, మోసపూరిత హామీలు, అమరావతి స్కాములు, మద్యం మాఫియా, రైతు సమస్యలు, ఉద్యోగుల బకాయిలు, ఆరోగ్యశ్రీ సంక్షోభం వంటి వందలాది అంశాలపై నేరుగా ప్రశ్నలు సంధించారు.
((బాక్స్ ఫుల్ పేజీ)))
ఒక్క ప్రశ్నకైనా సమాధానం ఉందా?
కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ, కాగ్, నీతి ఆయోగ్ నివేదికలు చూపిస్తూ జగన్ అడిగిన ప్రశ్నలకు టీడీపీ నుంచి ఒక్క సమాధానం కూడా రాలేదు. ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన చోట వ్యక్తిత్వ హననం, ఎదురుదాడి, కేసులు, సోషల్ మీడియా సెన్సార్ షిప్ లే అధికార పార్టీ ఆయుధాలయ్యాయని వైయస్సార్‌సీపీ మండిపడుతోంది.
‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ కాదా?
రెండేళ్ల పాలనలో ప్రజలకు చేసిన ఒక్క మంచి పని కూడా ఈ ప్రభుత్వం చెప్పలేకపోతోంది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా 143 హామీలు ఏమయ్యాయి? అంటే సమాధానం లేదు. ప్రజలకు మోసం తప్ప ఇంకేం దక్కింది?
డైవర్షన్ పాలిటిక్స్ కాదా?
ప్రభుత్వం వైఫల్యాలు బయటపడినప్పుడల్లా వెంటనే వైయస్సార్సీపీపై ఆరోపణలు చేసి టాపిక్ డైవర్ట్ చేయడం ఎందుకు? ఇదే రెండేళ్లుగా జరుగుతున్న స్క్రిప్ట్ కాదా?
రాజధాని లేకుండా చేస్తున్నది చంద్రబాబే కాదా?
లక్ష ఎకరాల అమరావతిలో కేవలం మౌలిక సదుపాయాలకే రూ.2 లక్షల కోట్లు ఖర్చవుతుంటే.. ఇది ఆచరణ సాధ్యమా? స్కాముల కోసం ప్రజల్ని మోసం చేయడం కాదా?
అమరావతి.. అప్పుల ఊబిలో పడలేదా?
ఇప్పటికే రూ.47,387 కోట్ల అప్పులు.. రాష్ట్ర ఖజానా నుంచి మరో రూ.9,200 కోట్లు.. ఇదేనా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్?
‘మావిగన్’ అంటే భయమెందుకు?
మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు కారిడార్‌ను రాజధాని కారిడార్‌గా ప్రతిపాదిస్తే ఎందుకు ఉలికిపడుతున్నారు? ప్రజల మద్దతు వస్తోందనే భయమా?
మళ్లీ కొత్త బిల్డింగులు ఎందుకు?
అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు ఇప్పటికే ఉండగా.. మళ్లీ వాటి పేరుతో వేల కోట్లు ఖర్చు పెట్టడం ఎందుకు?
ఒకే కంపెనీలకు మళ్లీ టెండర్లు ఎందుకు?
పాత టెండర్లు రద్దు చేసి మళ్లీ అదే కంపెనీలకు పనులు అప్పగించడం వెనుక మంత్రం ఏమిటి? ఇది ‘టైలర్ మేడ్ రిగ్గింగ్’ కాదా?
ఎస్‌ఎఫ్‌టీ ఖర్చు రూ.20 వేలు ఎందుకు?
దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతిలో నిర్మాణ వ్యయం ఎందుకు పెరిగింది? ఇది దోపిడీ కాదా?
రోడ్లు, ఫ్లైఓవర్లలో భారీ స్కాములు కాదా?
దేశంలో కి.మీ రోడ్డుకు రూ.24 కోట్లు ఖర్చైతే.. అమరావతిలో రూ.53 కోట్లు ఎందుకు? ఫ్లైఓవర్లకు రూ.189 కోట్లు ఎందుకు?
రైతులకు చెరువుల దగ్గర ప్లాట్లా?
సామాన్య రైతులకు ఒకలా.. బినామీలకు మరోలా రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వడం అన్యాయం కాదా?
విమర్శిస్తే సెన్సార్ చేస్తారా?
అమరావతి స్కాములు, మద్యం మాఫియా, లడ్డూ వివాదాలపై పోస్టులు పెడితే ఎందుకు డిలీట్ చేయిస్తున్నారు? పోలీసులు ట్విట్టర్, ఫేస్‌బుక్‌లకు లేఖలు ఎందుకు రాస్తున్నారు?
రాష్ట్రంలో జంగిల్ రాజ్ ?
తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలు, అరెస్టులు, వేధింపులు.. ఇవేనా ఇప్పుడు పాలన? ప్రశ్నిస్తే జైలు పంపడమేనా?
ఎవరిది గొడ్డలి పార్టీ?
రాజారెడ్డి హత్య, వైయస్సార్ మరణం, వివేకానందరెడ్డి హత్య.. ఇవన్నీ జరిగినప్పుడు అధికారంలో ఎవరు ఉన్నారు? ఎవరిది హత్యా రాజకీయాల సంస్కృతి?
దస్తగిరి దర్జాగా ఎందుకు తిరుగుతున్నాడు?
‘నేనే చంపాను’ అని పబ్లిగ్గా చెప్పిన దస్తగిరి అనే వ్యక్తి స్వేచ్ఛగా బయట ఎలా తిరుగుతున్నాడు? అతడికి చంద్రబాబు లాయర్ ఎందుకు వాదిస్తున్నారు?
బాలకృష్ణ టపాటపా లేపేయలేదా?
బాలకృష్ణ ఇంట్లో ఇద్దరిని కాల్చిన పడేసిన ఘటన తర్వాత కూడా ఎవ్వరినీ ఎందుకు ప్రశ్నించలేదు?
రంగా హత్యలో వేళ్లు ఎవరిని చూపించాయి?
నిరాహార దీక్షలో ఉన్న వంగవీటి రంగాను అర్ధరాత్రి చంపినప్పుడు అధికారంలో ఎవరు ఉన్నారు? హరిరామజోగయ్య పుస్తకంలో ఏముంది?
మల్లెల బాబ్జీ, పింగళి దశరథరామ్ కేసుల్లో నిజం ఏమిటి?
టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారే ఎందుకు టార్గెట్ అయ్యారు? ఈ ఘటనల్లో వేళ్లు ఎవరిని చూపించాయి?
పెద్ద దస్తగిరి హత్య కేసును వైయస్సార్సీపీపై ఎందుకు మోపుతున్నారు?
మృతుడి భార్యే వేరే కారణం చెప్పినా.. కేసును వైయస్సార్సీపీ వైపు ఎందుకు మళ్లిస్తున్నారు?
జోగి రమేష్‌పై కేసు రాజకీయ కక్ష కాదా?
తంబళ్లపల్లెలో జరిగిన నకిలీ మద్యం కేసును విజయవాడలో ఉన్న జోగి రమేష్‌పై మోపడం వెనుక కుట్ర ఏమిటి?
రాష్ట్రంలో నకిలీ మద్యం మాఫియా?
ప్రతి 5 బాటిళ్లలో ఒకటి నకిలీదే కదా? పోలీసులు బెల్ట్ షాపుల జోలికి ఎందుకు వెళ్లడం లేదు?
రైతులకు గిట్టుబాటు ధరలు ఎందుకు లేవు?
మొక్కజొన్న, శనగ, పొగాకు రైతులు రోడ్డెక్కినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?
మామిళ్లపల్లి రైతుల గోదాములపై దాడులు ఎందుకు?
ధర రాక పంట నిల్వ చేసుకుంటే గోదాములు సీజ్ చేయడమేంటి? రైతులను తాడుతో కట్టేయడమేంటి? ఇదేనా పాలన?
పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామన్న హామీ ఏమైంది?
మేనిఫెస్టోలో తగ్గిస్తామని చెప్పి.. ఇప్పుడు రూ.4 పెంచడం మోసం కాదా?
కాంట్రాక్టర్ల గురించే ఆలోచిస్తున్నారా?
పెట్రోల్ సంక్షోభ సమయంలో ప్రజల కోసం కాకుండా అమరావతి కాంట్రాక్టర్ల కోసం కేంద్రానికి లేఖలు ఎందుకు రాశారు?
ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఎక్కడ?
ప్రతి మహిళకు నెలకు రూ.1500, నిరుద్యోగులకు నెలకు రూ.3000 ఇస్తామని చెప్పి రెండేళ్లుగా ఎందుకు పైసా కూడా ఇవ్వలేదు?
రైతు భరోసా, అన్నదాత సుఖీభవలో మోసం కాదా?
కేంద్రం ఇచ్చేది కాకుండా అన్నదాత సుఖీభవ ఏటా రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చి.. తొలి ఏడాది ఎగ్గొట్టడం నిజం కాదా? రెండో ఏట రూ.14 వేలే ఇవ్వడం రైతులను మోసం చేయడం కాదా?
ఉచిత బస్సు హామీ కూడా తుస్సేనా?
మహిళలకు ఫ్రీ బస్సు అని చెప్పి.. 16 కేటగిరీల్లో 5 కేటగిరీలకే పరిమితం చేయడం ఎందుకు? ఆర్టీసీని ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్తున్నారా? ఎలక్ట్రిక్ బస్సుల్లో ఫ్రీ బస్సు లేదనడం స్కీమును ఎత్తేయడం కాదా?
గ్యాస్ సిలిండర్ల హామీ ఏమైంది?
ఇప్పటికి 9 సిలిండర్లు ఇవ్వాల్సి ఉండగా.. ఒకటి రెండు మాత్రమే ఎందుకు ఇచ్చారు? మిగతావి ఎప్పుడిస్తారు?
అమ్మఒడి లబ్ధిదారులను ఎందుకు తగ్గించారు?
“ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి” అన్న హామీ ఏమైంది? 20 లక్షల మంది పిల్లలను ఎందుకు తొలగించారు?
పెన్షన్లు ఎందుకు కట్ చేస్తున్నారు?
6 లక్షలకు పైగా పెన్షన్లు ఎందుకు తొలగించారు? కొత్త పెన్షన్లు ఒక్కటి కూడా ఎందుకు ఇవ్వడం లేదు?
విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు ఎందుకు?
విద్యార్థులకు వేల కోట్ల బకాయిలు పెట్టి చదువులు మానేసే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పటికి 9 త్రైమాసికాలు అయిపోయాయి. మొత్తం రూ.9,728 కోట్లు ఎందుకు ఇవ్వడం లేదు?
ఆరోగ్యశ్రీ నిర్వీర్యం కాలేదా?
నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.3,700 కోట్ల బకాయిలు పెట్టి.. ఇప్పుడు వారికి లోన్లు ఇప్పించడం ఏమిటి?
ఉద్యోగులను ఎందుకు మోసం చేస్తున్నారు?
డీఏలు, పీఆర్సీ, జీపీఎఫ్, మెడికల్ బిల్లులు, సరెండర్ లీవ్స్.. అన్నీ పెండింగ్‌లో ఎందుకు పెట్టారు? ఉద్యోగుల బకాయిలు రూ.35 వేల కోట్లు ఎందుకు పెట్టారు?
‘ముగ్గుర్ని కనండి’ అని చెప్పే ముందు హామీలు నెరవేర్చారా?
సూపర్ సిక్స్ హామీలు అమలు కాకముందే మూడో సంతానం, నాలుగో సంతానం గురించి మాట్లాడటం ప్రజలను మభ్యపెట్టడం కాదా?
విద్య, వైద్యం, వ్యవసాయం రంగాలు పూర్తిగా దెబ్బతినలేదా?
ఇంగ్లీష్ మీడియం, టోఫెల్, విద్యా సంస్కరణలు ఎందుకు ఆపేశారు? రైతులకు గిట్టుబాటు ధర ఎందుకు లేదు? వైద్యం ఎందుకు కుప్పకూలుతోంది?
=========
ప్రజల గొంతు వినిపించేది జగన్ మాత్రమే
ప్రజలు తమ బతుకు బండిని నడపడానికే తీవ్ర కష్టాలు పడుతున్నారు. ఈ ప్రభుత్వంలో ఉన్నవాళ్లు పూర్తిగా ప్రజల బాగోగులను పూర్తిగా గాలికి వదిలేసి, తాము ఇచ్చిన హామీలకు వెన్నుపోటు పొడిచి, దారుణమైన అవినీతిని, దోపిడీని కొనసాగిస్తున్నారు. రాష్ట్రాన్ని జంగిల్ రాజ్‌గా మార్చిన నేపథ్యంలో అన్యాయమైపోతున్న ప్రజల తరఫు గొంతు వినిపిస్తున్నది ఒక్క జగన్ మాత్రమే.
ప్రజలకు ఏం చేశారు?
చంద్రబాబు అనే వ్యక్తి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయ్యింది. నిజంగా మంచిచేయాలనుకుంటే ఈ రెండేళ్లు చంద్రబాబుకు ఒక గొప్ప అవకాశం. కోవిడ్ లాంటి సంక్షోభం లేదు. ఇతరత్రా రాజకీయపరమైన, ఆర్థికపరమైన ఇబ్బందులు అంతకన్నా లేవు. మరి ఈ రెండేళ్లలో ప్రజలకు ఇది చేశానని గర్వంగా చెప్పుకోగలిగే పరిస్థితి చంద్రబాబుకు ఉందా? సంక్షేమం అందించడంలో, రాష్ట్రాన్ని అభివృద్ధిచేయడంలో తన ముద్ర ఇదీ అని ఒకటైనా చెప్పుకోగలిగారా? మేనిఫెస్టోలో ఇచ్చిన 143 హామీల సంగతి దేవుడెరుగు, కనీసం సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలనైనా అమలు చేయగలిగాడా?
బాబు ష్యూరిటీ, మోసం గ్యారెంటీ
చంద్రబాబు పరిపాలనా వైఫల్యాలమీద, తాను ఇచ్చిన హామీలను మోసాలుగా మార్చడంమీద పబ్లిక్ మీటింగ్స్‌లోనే కాకుండా కేవలం ఈ రూమ్‌లో ఉన్న ఈ వేదికనుంచే 24నెలల కాలంలో 25 ప్రెస్‌మీట్లు పెట్టి, 46 గంటలపాటు సుదీర్ఘంగా ప్రతి అంశంపైనా ప్రజల తరఫున జగన్ గట్టిగా ప్రశ్నించారు. కానీ ఏరోజు చంద్రబాబు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అన్నదాన్ని ప్రతిరోజూ రుజువు చేస్తూనే, రెండేళ్లుగా చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు.
పబ్లిసిటీతో డ్రామాలు
ఈ రెండేళ్లలో చంద్రబాబు ప్రజలకు చేసిన మంచి ఏదీలేదు, చూపించడానికి చేసిన అభివృద్ధి అంతకన్నా లేదు, ఇక భవిష్యత్తులో చేస్తారన్న నమ్మకం ప్రజలకూ లేదు. ఈ రెండేళ్లు జరిగింది ఏంటంటే, ఫస్ట్‌క్లాస్ పబ్లిసిటీ. చంద్రబాబు గొప్ప తనం ఏంటో ఆయనకు ఆయనే పెట్టుకున్న హోర్డింగుల్లో, యాడ్స్‌లో, ఆయనకు ఆయనే రాయించుకుంటున్న కథనాల్లో కాదు, ప్రజల జీవితాల్లో కనిపించాలి. చేసే మంచి పనులతో ప్రజల గుండెల్లో స్థానం వస్తుంది కాని, మీడియా మేనేజ్‌మెంట్‌తోనో, పబ్లిసిటీతోనో కాదు.
ఘోరంగా బాబు ప్రోగ్రెస్ రిపోర్టు
చివరి ఏడాది ఎన్నికల హడావిడి తీసేస్తే, చంద్రబాబుకు ఇక మిగిలేవి రెండేళ్లు. కానీ చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు చూస్తే అత్యంత ఘోరంగా ఉంది. దీన్ని దాచిపెట్టడానికి, టక్కుటమార విద్యలన్నీ ప్రదర్శిస్తున్నాడు. ఒక కుతర్కాన్ని ప్రదర్శిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని భూతంలా చూపెట్టాలి, లేనిపోనివి ఆపాదించాలి. తాను ప్రజలకు ఏమీ చేయలేకపోయారు కాబట్టి, దానికి బదులుగా జగన్ వస్తే ప్రమాదం అని భయాన్ని సృష్టించి, తన దోపిడీ, అవినీతి, జంగిల్‌రాజ్ పాలన నుంచి డైవర్షన్ చేసి రాజకీయంగా బతికేయాలని చూస్తున్నారు. దీంట్లో భాగంగానే రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా, తాను ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నానన్న స్పృహ కూడా లేకుండా, ఇంగితం కూడా లేకుండా, బరితెగించిన కోడి బజారుకు ఎక్కిందన్న మాదిరిగా, నిర్లజ్జగా చంద్రబాబు మాట్లాడుతున్నారు.
వైయస్ జగన్ సంధించిన ప్రశ్నలపై ప్రజల్లో చర్చ
చంద్రబాబు అవినీతికోటను బద్దలు కొడుతూ వైయస్ జగన్ ప్రతి ప్రస్ మీట్లో అడుగుతున్న సూటి ప్రశ్నలు ప్రజల్ని ఆలోచింపజేస్తున్నాయి. ఆధారాలతో సహా చూపి ప్రశ్నిస్తుండడంతో దీనిపై జనం జోరుగా చర్చించుకుంటున్నారు. ఒక్క అంశానికి కూడా జవాబివ్వకుండా వ్యక్తిత్వహననం, ఎదురుదాడి చేస్తున్న టీడీపీ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు దుష్ట రాజకీయం మానుకుని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
====



